27 February, 2026 | 7:15 PM

అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి

27-02-2026 12:00 AM

బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ చైర్‌పర్సన్

కేసముద్రం, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): అభివృద్ధి లక్ష్యంగా సమిష్టి కృషితో కౌన్సిల్ సభ్యులు పనిచేయాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అన్నారు. గురువారం కేసముద్రం మున్సిపాలిటీ చైర్ పర్సన్ బానోత్ సునీత, వైస్ చైర్పర్సన్ డాక్టర్ అల్లం రామ, కౌన్సిలర్లు మున్సిపాలిటీ కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై నూతన పాలకమండలి ప్రతినిధులను ఘనంగా సత్కరించి అభినందించారు.

అనంతరం కమిషనర్ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల వరకే రాజకీయాలు పరిమితం చేయాలని, అభివృద్ధి సంక్షేమ విషయంలో అంత కలిసిమెలిసి నూతనంగా ఏర్పడ్డ కే సముద్రం మున్సిపాలిటీని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాలన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సక్రమంగా అమలు చేసే విధంగా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, వ్యాపార వాణిజ్య సంఘాల ప్రతినిధులు పాల్గొని నూతన పాలకమండలి సభ్యులను ఘనంగా సత్కరించారు.