22 July, 2026 | 10:53 AM

రైలు కింద పడి వ్యక్తి మృతి

01-06-2024 03:31 AM

జహీరాబాద్, మే 31 : జహీరాబాద్ పట్టణంలోని రైల్వేస్టేషన్‌లోని ఫ్లాట్ ఫాం నంబర్ 1లోని పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి పడి మృతి చెందినట్టు వికారాబాద్ రైల్వే పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. స్థానిక రైల్యేస్టేషన్ ఆవరణలోని ఫ్లాట్ ఫాం ఒకటో నంబర్ మార్గంలోని వెళ్తున్న రైలు కింద పడి శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్ట స్థానిక రైల్వే సిబ్బంది సమాచారం మేరకు సంఘటన స్థలాన్ని వికారాబాద్ పోలీసులు సందర్శించారు.

మృతుడి వయస్సు (60) వరకు ఉంటుందని, శరీరంపై ముదురు రంగు ప్యాంటు, ఎరుపు రంగు షార్టు, కుడిపక్కా ఎముకపై ఒక పుట్టుమచ్చ, ఛాతీపై ఎడుమ వైపున ప్రేమ చిహ్నమైన పచ్చబొట్టు ఉందన్నారు. మృతుడి వద్ద ఇతర ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. మృతుడి అచూకీ లభించే వరకు వికారాబాద్ ప్రభుత్వ దవాఖానలోని మార్చురీ గది మూడు రోజుల పాటు భద్రపరుస్తామని తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 871268587కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వికారాబాద్ రైల్వే పోలీసులు పేర్కొన్నారు.