16 July, 2026 | 3:54 PM

ఎస్బీఐ డెబిట్ కార్డులపై చార్జీల పెంపు

20-04-2024 12:20 AM

ముంబై, ఏప్రిల్ 19: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) జారీచేసిన కొన్ని డెబి ట్ కార్డులపై వార్షిక నిర్వహణా చార్జీలు పెరిగాయి. ప్రతిపాదిత చార్జీలు 2024 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఎస్బీఐ వెబ్‌సైట్‌లో పొందుపర్చిన వివరాలివి..

క్లాసిక్ డెబిట్ కార్డులు

క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డుల యాన్యువల్ మెయింటేనెన్స్ చార్జీలు ప్రస్తుత రూ.125+జీఎస్టీ నుంచి రూ.200+జీఎస్టీకి పెంచారు. 

యువ, ఇతర కార్డులు

యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డు, మై కార్డ్ (ఇమేజ్ కార్డు)ల వార్షిక నిర్వహణా చార్జీ ప్రస్తుత రూ.175+జీఎస్టీ నుంచి రూ.250+జీఎస్టీకి పెరుగుతుంది.

ప్లాటినం డెబిట్ కార్డు

ఎస్బీఐ ప్లాటినం డెబిట్ కార్డు వార్షిక నిర్వహణా చార్జీ ప్రస్తుత రూ.250+జీఎస్టీ నుంచి రూ.325+జీఎస్టీకి చేరుతుంది.

ప్రీమియం బిజినెస్ డెబిట్ కార్డు

ప్రైడ్ ప్రీమియం బిజినెస్ డెబిట్ కార్డు తదితర ప్రీమియం డెబిట్ కార్డులకు యాన్యువల్ మెయింటేనెన్స్ చార్జీలు ప్రస్తుత రూ.350+జీఎస్టీ నుంచి రూ.425+జీఎస్టీకి పెరుగుతుంది.