23 April, 2026 | 1:31 AM

మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంపు

23-04-2026 12:11 AM
  1. సమ్మె కాలంలో గరిష్ఠంగా 56 మెట్రో సర్వీసులు
  2. మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో 4.20 నిమిషాలకో మెట్రో
  3. నాగోల్- రాయదుర్గం మార్గంలో 3.40 నిమిషాలకో సర్వీసు

హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హైదరాబాద్ నగరవాసులు ఇబ్బందులు పడకుండా మెట్రో రైలు సర్వీసులను ఆ సంస్థ పెంచింది. మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీని గరిష్ఠస్థాయికి పెంచింది. సమ్మెకాలంలో గరిష్ఠంగా 56 మెట్రోరైలు సర్వీసుల ను నడపాలని నిర్ణయించింది. సాధారణ రోజుల్లో ఉదయం 8 నుంచి 10.30 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 8.00 గంటల వరకు పీక్ అవర్స్‌లో 56 రైళ్లు నడుస్తాయి.

ఈ సమయంలో రెండు రైళ్ల మధ్య నిడివి 3 నిమిషాల 40 సెకన్లు ఉంటుంది. నాన్-పీక్ అవర్స్ లో మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో 4 నిమిషాల 50 సెకన్లు, నాగోల్-రాయదుర్గ్ మార్గంలో 5 నిమిషాల 20 సెకన్ల నిడివితో 44 రైళ్లు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీ సమ్మెను దృష్టిలో ఉంచుకొని రోజంతా గరిష్ఠంగా 56 రైళ్లు నడపాలని ఆ సంస్థ అధికా రులు నిర్ణయించారు.

దీంతో మియాపూర్- ఎల్బీనగర్ మార్గంలో 4 నిమిషాల 20 సెకన్లు, నాగోల్- రాయదుర్గ్ మార్గంలో 3 నిమిషాల 40 సెకన్లకో మెట్రో రైలు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రాత్రి 11 గంటల తర్వాత చివరి మెట్రో సర్వీసును పొడిగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు.