calender_icon.png 24 January, 2026 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెరిగిన వెండి ధరలు

24-01-2026 12:55:46 AM

కిలో @ 3,60,000

న్యూఢిల్లీ, జనవరి 23: రోజుకు రోజుకూ వెండి, ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఏ రోజుకారోజు కొత్త రికార్డులు బద్దలవుతూనే ఉన్నాయి. కిలో వెండి ధర గురువారం రూ.3,40,00 పలుకగా, శుక్రవారానికి రూ.20,000 పెరిగి రూ.3,60,000కు చేరుకున్నది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం గురువారం రూ.1,54,310 పలుకగా, అది కాస్త  రూ.5,400 పెరిగి రూ.1,59,710 పలికింది. ఒక్క  ఈ ధరలే తలకు మించిన భారమంటే..

జ్యూయలరీ షాపుల్లో జీఎస్టీ, మేకింగ్ చార్జీలు అదనం. మొత్తంగా వెండి, బంగారం కొనుగోలు సామాన్యులకు తలకుమించిన భారంలా పరిణమించింది. ధరలు చుక్కలనంటుతుండటంతో శుభకార్యాలకు ఆభరణాలు కొనుగోలు చేయలేక సామాన్యులు బిక్కుమంటున్నారు. అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తలు, డాలర్ విలువ బలహీనపడుతుండటంతోనే ధరలు పెరుగుతున్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.