1 July, 2026 | 6:10 AM

పెరుగుతున్న ఆకాశహర్మ్యాల సంఖ్య

26-05-2024 12:05 AM

హైదరాబాద్‌లో నిర్మాణ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. నగర శివారులో ముఖ్యంగా వెస్ట్, సౌత్ హైదరాబాద్‌లో ఆకాశహర్మ్యాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2023 40 నుంచి 50 ఆంతస్తుల నిర్మాణాలు కోసం ఎక్కువు దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. 250 గజాల పైచిలుకు విస్తీర్ణంలో చేసే నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి. ఇందులో ప్రధానంగా టీఎస్‌బీపాస్‌లో ఇన్‌స్టెంట్ రిజిస్ట్రేషన్‌లో భాగంగా 496 అనుమతులు మంజూరు కాగా,  అన్‌స్టెంట్ అప్రూవల్ కోసం 8122, సింగింల్ విండోలో 2,456, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌లో భాగంగా 2,567 అనుమతులను జారీ చేసినట్లు ఇటీవల జీహెచ్‌ఎంసీ వెల్లడించింది.  గతంలో మూడు బెడ్ రూంల ప్లాట్లను అద్దెకు తీసుకునేవారి సంఖ్య తక్కువ. కానీ కొవిడ్  తర్వాత పరిస్థితి మారింది. మెజార్టీ ప్రజలు విశాలమైన మూడు బెడ్ రూంల ప్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. ప్రజల డిమాండ్‌కు తగినట్లుగా ఎక్కువ మంది బిల్డర్లు మూడు బెడ్‌రూంలకు తగ్గకుండా అపార్ట్‌మెంట్ ప్లాట్లను నిర్మిస్తుండటంతో పాటు హైరేజ్ బవంతులను ఎక్కువగా నిర్మిస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు.