1 July, 2026 | 7:15 AM

రియల్ పెట్టుబడుల్లో.. ఎన్‌ఆర్‌ఐల హవా

26-05-2024 12:05 AM

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 25 (విజయక్రాంతి):  రియల్ పెట్టు బడులలో ఎన్‌ఆర్‌ఐల హవా కొనసాగుతోంది. కరోనాకు ముందు రియల్ ఎస్టేట్ రంగంలో 7-10 శాతం ఎన్‌ఆర్‌ఐ ల పెట్టుబడులు ఉండేవి. కానీ ప్రస్తుతం పెద్ద పెద్ద డెవలపర్లు చేపడుతున్న ప్రాజెక్టుల్లోని అమ్మకాల్లో 25శాతం ఎన్‌ఆర్‌ఐలే కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్లకు డిమాండ్ పెరగడంతో ధరలు కూడా క్రమంగా పెరుగుతు న్నాయి. ఎన్‌ఆర్‌ఐలకు అమెరికా, సింగపూ ర్, యూఏఈ, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా ఎన్‌ఆర్‌ఐలకు పెద్ద మార్కెట్లుగా ఉన్నాయి. తాజాగా భారత్ లో కూడా ఎన్నారైల పెట్టుబడులు పెరిగాయని రియల్ నిపుణులు పేర్కొంటున్నారు. 

డీఎల్‌ఎఫ్‌లో 25 శాతం వాటా ఎన్‌ఆర్‌ఐలదే..

దేశంలోని అతిపెద్ద డెవలపర్ అయిన డీఎల్‌ఎఫ్ సంస్థ గురుగ్రామ్‌లో చేపట్ట్టిన ప్రవాస ప్రాజెక్టులో అమ్మకాల్లో 25 శాతం వాటా ఎన్‌ఆర్‌ఐలదే. దీని విలువ దాదాపు రూ.1800 కోట్లు ఉంటుందని రియాల్టర్లు పేర్కొంటున్నారు. 2023 డీఎల్‌ఎఫ్‌కు సంబంధించి జరిగిన అమ్మకాల్లో రూ.3400 కోట్లు ఎన్‌ఆర్‌ఐల నుంచి వచ్చాయి. ఇది డీఎల్‌ఎఫ్ మొత్తం అమ్మకాల విలువలో దాదాపు 20 శాతం కావడం గమనార్హం. 2019 ఆర్థిక సంవత్సరంలో భారత రియల్ మార్కెట్లోకి వచ్చిన పెట్టుబడుల్లో దాదాపు 10 శాతం ఎన్‌ఆర్‌ఐలవేనని గణాంకాలు చెబుతున్నాయి. 

తర్వాత కాలంలో ఇది మరింత పెరిగిందని అంచనా. ముఖ్యంగా దుబాయి, అబుదాబీ, లండన్, సింగపూర్, హాంకాంగ్, అమెరికాలో ఉంటున్న ఎన్‌ఆర్‌ఐైలు భారత్ లో పెట్టబడులు పెట్టడానికి అధికంగా ముందుకొస్తున్నారు. మన రియల్ రంగం లో దాదాపు 20 శాతం వాటాతో కీలకంగా వ్యవహరిస్తున్నారని రియల్ నిపుణులు చెబుతున్నారు. 

భవిష్యత్తులో పెరిగే అవకాశం...

వచ్చే రెండేళ్లలో మనదేశంలోని లగ్జరీ రియల్ రంగంలో పెట్టుబడు లు పెట్టడానికి ఎక్కువ మంది ఎన్‌ఆర్‌ఐైలు యోచిస్తున్నట్టు ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. స్వదేశంలోని పెద్ద పెద్ద ప్రాపర్టీల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది అనువైన సమయంగా వారు భావిస్తున్నట్టు  సర్వేలో వెల్లడైంది. భారత రూపాయి విలుతో పోలిస్తే.. అమెరికా డాలర్ పెరుగుతుండటం వారికి బాగా కలిసొస్తున్న అంశమ ని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తు తం రెసిడెన్షియల్ మార్కెట్‌లో ఎన్‌ఆర్‌ఐల వాటా పెరుగుతోందని, భవిష్యత్తులో ఇది రెట్టింపు అవుతుందని రియాల్టర్లు భావిస్తున్నారు.