బీఆర్‌ఎస్ అభ్యర్థికి పెరుగుతున్న ప్రజాదరణ
09-05-2024 01:02 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 8 (విజయక్రాంతి) : హైదరాబాద్ పార్లమెంట్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్‌కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మారథం పడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని గోషామహల్ నియోజకవర్గంలోని గన్‌ఫౌండ్రి, బొగ్గుల కుంట, గుజరాత్ గల్లీ, జగనాథ్ బడా, తదితర ప్రాంతాల్లో ‘జనం కోసం నేను’ అనే నినాదంతో ఆయన ప్రజల్లోకి వెళ్లారు. తనను గెలిపిస్తే విద్యార్థులకు మంచి విద్య, ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం అందించేందుకు కృషి చేస్తానన్నారు. బీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీసీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.




