14 August, 2026 | 1:56 AM

23 అర్ధరాత్రి నుంచి ఆటోల నిరవధిక సమ్మె

14-08-2026 12:42 AM
  1. ఆటో, యాప్ ఆధారిత డ్రైవర్ల సంఘాల జేఏసీ
  2. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్

ముషీరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకుంటే రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని ఆటో, యాప్ ఆధారిత డ్రైవర్ల సంఘాల జేఏసీ హెచ్చరించింది. ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్టు ప్రకటించింది. గురువారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు.

జేఏసీ కన్వీనర్   వెంకటేశం (ఏఐటీయూసీ) మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్‌చేశారు.  ఈ సందర్భంగా బంద్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.  సదస్సులో ఆటో డ్రైవర్ల సంఘాల నేతలు గాజుల ముకేశ్‌గౌడ్, వీ మారయ్య, పీ శ్రీకాంత్, రవిశంకర్, వీ ప్రవీణ్, జీ మల్లేశ్‌గౌడ్, పీ యాదగిరి, శివానంద, డీ శ్రీనివాస్, ఎస్ జమా, ఎస్ దయానంద్, కొమరయ్య, బీ రాజుగౌడ్, మంద రవికుమార్, ఎంఏ సలీమ్, ఎండీ మజీద్ తదితరులు పాల్గొన్నారు.