15-08-2025 12:44:55 PM
చిట్యాల,(విజయక్రాంతి): మండలంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. తహసిల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఇమామ్ బాబా,పోలీస్ స్టేషన్ లో సీఐ దగ్గు మల్లేష్ యాదవ్,మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో జయశ్రీ, ప్రెస్ కార్యాలయంలో అధ్యక్షుడు కాట్రేవుల ఐలయ్య,చౌరస్తాలో మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి,బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు అల్లం రవీందర్,బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్,పీఏసీఎస్ కార్యాలయంలో చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రిలో ఇన్చార్జి సూపర్డెంట్ శ్రీకాంత్, వెలుగు బాలికల పాఠశాలలో ప్రిన్సిపల్ గోల్కొండ బిక్షపతి,ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ శ్రీదేవి,మోడల్ పాఠశాలలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ రమేష్, కాకతీయ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయుడు రాజ్ మహమ్మద్,కస్తూర్బా గాంధీ పాఠశాలలో ప్రిన్సిపాల్ సుమలత, వివిధ సంఘాల నాయకులు జాతీయ జెండాను ఎగురవేశారు.