15-08-2025 08:25:16 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ రామ్మోహన్ జాతీయ జెండా ఆవిష్కరించి విద్యార్థులకు నోట్ పుస్తకాలు,పెన్నులు పంపిణీ చేశారు.
మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ సర్తాజ్ పాషా, మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో నాగరాజు, మండల విద్యాధికారి కార్యాలయంలో మండల విద్యాధికారి డాక్టర్ సునీత జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో ఆకట్టుకున్నారు.ప్రభుత్వ కార్యాలయాలలో, పాఠశాలల్లో, పలు ప్రధాన వీధులలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.