15-08-2025 12:43:26 PM
నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం నల్లగొండ జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. వివిధ కార్యాలయాల్లో ఆయా అధికారులు జాతీయ జెండాను ఎగరవేశారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఇలా త్రిపాటి, కోర్టులో జిల్లా జడ్జి నాగరాజు, జిల్లా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ ఇలా త్రిపాటి, జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్చంద్ర పవార్, రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీవో అశోక్ రెడ్డి, డివిజన్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ శివరాం రెడ్డి, నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, బిజెపి కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, బిఆర్ఎస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రవీందర్ కుమార్ నాయక్, సిపిఐ కార్యాలయంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్యే నివాసంలో కంచర్ల భూపాల్ రెడ్డి, డిసిసిబి కార్యాలయంలో చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, ఎం వి ఎన్ విజ్ఞాన కేంద్రంలో అక్కనపెల్లి మీనయ్య, జాతీయ జెండాలని ఎగరేసి స్వాతంత్ర వేడుకలు జరుపుకున్నారు.