15-08-2025 09:00:27 PM
ఎర్రుపాలెం,(విజయక్రాంతి): మండల వ్యాప్తంగా 79 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని రెవెన్యూ ఆఫీసు నందు తహసీల్దార్ మన్నె ఉషా శారద జాతీయ జెండా ఎగురవేశారు. ఎండిఓ ఆఫీస్ నందు మండల ప్రత్యేక అధికారి విజయ చందర్ జాతీయ జెండాను ఎగరవేశారు.
మండల ఎంపీడీవో అధికారి బి.సురేందర్ మండలంలోని వివిధ గ్రామపంచాయతీ ఆఫీస్ నందు జాతీయ జెండాను ఎగరవేశారు. ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్ నందు ఎస్సై రమేష్ కుమార్ జాతీయ జెండాను ఎగరవేశారు. మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలో, ప్రైవేటు పాఠశాలలలో జాతీయ జెండాను ఎగురవేసి స్వీట్స్ ను వితరణ చేశారు.