15-08-2025 09:03:39 PM
రామగుండం,(విజయక్రాంతి): ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ జన్మదిన సందర్భంగా శుక్రవారం యైటింగ్ లైన్ కాలనీలో నిర్వహించిన రక్త దాన శిబిరంలో ముత్తారం మండలంలోని ఓడేడు గ్రామానికి చెందిన సింగరేణి కార్మికుడు, డంపర్ ఆపరేటర్ చుంచు కొమురయ్య రక్తదానం చేశాడు. ఈ సందర్భంగా కార్మికుడు కొమురయ్య మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ కాదని ఒక శక్తి లాంటివాడని ఆయన రామగుండం నియోజకవర్గాన్ని రతనాల రామగుండంగా రాబోయే రోజుల్లో తీర్చిదిద్దబోత్తున్నాడని అన్నారు.