25 July, 2026 | 5:21 AM

ముగిసిన ఇండియా కూటమి సమావేశం

27-06-2024 09:38 PM

న్యూఢిల్లీ : ఢిల్లీలోని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నివాసంలో  ఇండియా కూటమి సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్, ఆర్జేడీ ఎంపీ మిసా భారతి, ఎన్సీపీ నుంచి శరద్ పవార్, సుప్రియా సూలే, కేసీ వేణుగోలపాల్, ఆప్ నేత సంజయ్ సింగ్, టీఎంసీ నేత డెరెక్ ఓబ్రియన్ హాజరయ్యారు. 2024 లోక్ సభ స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగంపై చర్చలు జరిపిన ఇండియా కూటమి నేతలు నీట్, అగ్నివీర్, నిరుద్యోగం వంటి అంశాలపై పార్లమెంట్ లో లెవనెత్తాలని నిర్ణయించారు.