12 March, 2026 | 10:33 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

భారత్‌-రష్యా మధ్య కీలక ఒప్పందాలు

05-12-2025 03:00 PM

భారత్‌-రష్యా మధ్య కీలక ఒప్పందాలు

భారత్‌, రష్యా మధ్య 2030 వరకు ఒప్పందం

న్యూఢిల్లీ: భారత్-రష్యా(India and Russia) దేశాలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇరుదేశాల మధ్య సహకారం, వలస విధానం, వైద్య, ఆరోగ్య రంగాలు, కెమికల్స్, ఫెర్టిలైజర్స్ సరఫరా, సముద్ర ఆహార ఉత్పత్తులు, కార్మికులు, షిప్పింగ్ పై కీలక ఒప్పందాలు జరిగాయి. అనంతరం ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ... రష్యా మనకు ఎప్పటి నుంచో  మిత్ర దేశం అన్నారు. రెండు దేశాల మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు.

భారత్, రష్యా స్నేహం.. ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయని పేర్కొన్నారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు మైలురాయిగా నిలుస్తాయని తెలిపారు. ఇరుదేశాల మధ్య వ్యాపార సంబంధాలు పరస్పర ప్రయోజనం కలిగిస్తున్నాయన్నారు. భారత్ వాణిజ్యానికి రష్యా అండగా నిలుస్తోందని మోదీ వెల్లడించారు. ఇరుదేశాల ఆర్థిక సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుతాయన్నారు. యూరియా ఉత్పత్తికి రష్యా సాయం చేస్తోందని వివరించారు. ఆర్థిక ప్రణాళికలపై 2030 వరకు ఇరుదేశాల మధ్య ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఎఫ్ టీఏ తుది అంకానికి ఇరుదేశాలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు.