calender_icon.png 5 December, 2025 | 2:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌ హౌస్‌లో మోడీ-పుతిన్ భేటీ

05-12-2025 01:31:39 PM

భారత్‌ ఎల్లప్పుడూ శాంతి వైపే 

న్యూఢిల్లీ: హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీ(PM Narendra Modi), రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ అయ్యారు. భారత్‌-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. చర్చల ఆరంభంలోనే పుతిన్‌తో శాంతి గురించి మాట్లాడారు. ఉక్రెయిన్‌-రష్యా వివాదం దౌత్య, శాంతి చర్చల ద్వారానే సాధ్యమవుతుందని ప్రధాని ప్రస్తావించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో భారత్ తటస్థంగా లేదని చెప్పిన ప్రధాని మోదీ భారత్ ఎల్లప్పుడూ శాంతి వైపే ఉంటుందని స్పష్టం చేశారు. రష్యా- ఉక్రెయిన్‌ దేశాలు శాంతి మార్గంలోకి వస్తాయని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. పుతిన్ విజన్ కు భారత్, రష్యా ఒప్పందాలే ఉదాహరణ అని మోదీ తెలిపారు. భారత్, రష్యా సంబంధాలకు చారిత్రక నేపథ్యం ఉందని పుతిన్ తెలిపారు. భారత్-రష్యా మధ్య 25 ఒప్పందాలు జరుగనున్నాయి. పుతిన్ విజన్ ను ప్రధాని అభినందించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కీలకమైన శిఖరాగ్ర సమావేశ చర్చలకు ముందు శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సాదర స్వాగతం, త్రివిధ దళాల గౌరవ వందనం లభించింది. ప్రధానమంత్రి రష్యా నాయకుడికి ప్రైవేట్ విందు ఇచ్చిన ఒక రోజు తర్వాత, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మోడీ  రాష్ట్రపతి భవన్ ముందు ప్రాంగణంలో రష్యా అధ్యక్షుడిని హృదయపూర్వకంగా స్వాగతించారు. ఆచార స్వాగతం అనంతరం, పుతిన్ రాజ్ ఘాట్ ను సందర్శించి, మహాత్మా గాంధీ స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించారు.