20 March, 2026 | 4:59 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

మేం మేల్కొనేలోపే భారత్ విరుచుకుపడింది

30-05-2025 02:48 AM
  1. బ్రహ్మోస్ క్షిపణులతో మెరుపు దాడులు చేసింది
  2. దాడులు జరగడాన్ని అంగీకరించిన పాక్ ప్రధాని

ఇస్లామాబాద్, మే 29: పాకిస్థాన్ సైన్యం మేల్కొనేలోపే కీలక సైనిక స్థావరాలే లక్ష్యంగా బ్రహ్మోస్ క్షిపణులతో భారత్ మెరుపు దాడులు చేసిందని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు.  ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా పాకిస్థాన్, పీవోకేలో దా డుల చేసిన భారత సైన్యం అనేక ఉగ్ర, సైనిక స్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అజర్‌బైజాన్ పర్యటనలో భాగంగా ఒక కార్యక్రమంలో ఆయన దాడు లు జరిగిన విషయాన్ని అంగీకరించారు. భారత్ దాడులను ధీటుగా తిప్పికొట్టాలని మే 9వ తేదీ రాత్రి నిర్ణయించుకున్నామని తెలిపారు.

అయితే 10వ తేదీ తెల్లవారుజామున ప్రార్థనలు ముగిసిన వెంటనే దాడులు చేసేందుకు తమ సైన్యం సిద్ధమైందన్నారు. కానీ తమ ప్రణాళిక అమలుకు కొన్ని గం టల ముందే బ్రహ్మోస్ క్షిపణులతో భారత్ విరుచుకుపడిందని తెలిపారు. రావల్పిండి  ఎయిర్‌పోర్టు సహా అనేక కీలకప్రాం తాలే లక్ష్యంగా దాడులు చేసిందన్నారు. అయితే దాడుల ప్రణాళిక గురించి ఆర్మీ చీఫ్ మునీర్ ముందుస్తుగా చెప్పినప్పటికీ తాము అలెర్ట్ అవ్వలేకపోయామన్నారు.