ఎన్నికలకు సిద్ధం.. వెంటనే నిర్వహిస్తారా?
- మోదీ విమర్శలపై సీఎం మమతా ఘాటు స్పందన
- బెంగాల్ ప్రజలు మా వెంటే ఉన్నారు
- తృణముల్‌కే పూర్తి మద్దతు ఇస్తారని వ్యాఖ్య
కోల్‌కతా, మే 29: బెంగాల్‌లో దయలేని ప్రభుత్వ పాలన కొనసాగుతుందని ప్రధాని మోదీ విమర్శించడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని మోదీ ప్రభుత్వం వెంటనే ఎన్నికలు నిర్వహించగలరా అని దీదీ సవాల్ విసిరారు. మమతా మాట్లాడుతూ.. రాష్ట్రంలో దయలేని పాలన కొనసాగుతుందని మోదీ పేర్కొనడం సరికాదన్నారు.
తామంతా ఒక్కటే, ఉగ్రవాదాన్ని సహించేది లేదు, ఐక్యతే తమ బలం అనే సందేశాన్ని తెలియజేయడానికి అఖిలపక్ష ప్రతినిధులు విదేశాల్లో పర్యటిస్తున్న సందర్భంలో ప్రధాని వ్యాఖ్యలు బాధించాయని పేర్కొన్నారు. ఆయను నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం తనను ఆశ్చర్యానికి గురి చేశామని తెలిపారు. బెంగాల్ ప్రజలు తమ వెంటే ఉన్నారని, టీఎంసీకే పూర్తి మద్దతు ఉంటుందన్నారు. దమ్ముంటే అసెంబ్లీ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని మోదీకి సవాల్ విసురుతున్నట్టు వెల్లడించారు.




