ట్రై సిరీస్ మనదే
ఫైనల్లో వైభవ్ విధ్వంసం
11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
శ్రీలంక ఏ జట్టుపై విజయం
భారత యువ జట్టు అదరగొట్టింది. చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి తోడు మిగిలిన బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో భారీ స్కోరు చేసిన యంగ్ ఇండియా బౌలింగ్‌లోనూ సత్తా చాటింది. ఫలితంగా ముక్కోణపు సిరీస్ ను కైవసం చేసుకుంది.
దంబుల్లా, జూన్ 21 : గత మ్యాచ్‌లో సూ పర్ ఓవర్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని లక్ష్యంగా భారత్ ఏ బ్యాటింగ్ సాగింది. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకూ పెద్దగా చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడని వైభవ్ తుది పోరులో రెచ్చిపోయాడు. గత మ్యాచ్‌లో లంక ఆటగాళ్లు రెచ్చగొట్టారన్న కసితో మరింత చెలరేగిపోయాడు. క్రీజులోకి వస్తూనే లం క ఏ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
బాదడమే పనిగా పెట్టుకున్న వైభవ్ సూర్యవంశీ కేవలం 11 బంతుల్లోనే సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. తొలి బంతినే ఫోర్ కొట్టి బుడ్డోడు తర్వా త వరుసగా రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బా దాడు. ఆరో బంతిని డాట్ చేసిన వైభవ్ తర్వాత వరుసగా 6, 4, 4, 6, 6 కొట్టి కేవ లం 11 బంతుల్లోనే ఫిఫ్టీ బాదేశాడు. దీంతో లిస్ట్ ఏ క్రికెట్‌లో అత్యంత వేగం గా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇదే జోరులో సెంచరీ బా దుతాడని అంతా ఎదురుచూస్తుండగా 94 పరు గుల దగ్గర ఔటయ్యాడు.
లంక ఏ బౌలర్లను ఉతికారేసిన వైభవ్ కేవలం 29 బంతుల్లోనే 94 రన్స్ చేశా డు, అతని ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు, 10 ఫోర్లు ఉన్నాయి. అంటే 88 పరుగులు బౌండరీల ద్వారానే వచ్చాయి. వైభవ్ క్రీజులో ఉన్నంతసేపూ భారత్ రన్ రేట్ ఓవర్‌కు 15కు పైగా సాగింది. వైభవ్ సూర్యవంశీ సృష్టిం చిన విధ్వంసంతో పాటు రుతురాజ్ గైక్వాడ్ 40 పరుగుల వద్ద ఔట్ కాగా.. తిలక్ వర్మ బాధ్యతాయుతంగా ఆడుతూ 90 బంతుల్లో 67 పరుగులు(4 ఫోర్లు, ఒక సిక్స్) చేశాడు.
అనంతరం కు మార్ కుశాగ్ర 36 పరుగులు, విప్రజ్ నిగమ్ 27 పరుగులు చేయగా.. చివర్లో అనుకుల్ రాయ్ కేవలం 15 బంతుల్లోనే 39 పరుగులతో మెరుపులు మెరిపించాడు. దీంతో భారత్ ఏ 377 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఛేజింగ్‌కు దిగిన శ్రీలంక- ఏ ఆది నుంచి వికెట్లు కోల్పోయింది. భారత పేసర్ యశ్ ఠాకూర్ పవర ప్లేలోనే నిరోషన్ డిక్వెల్లా (25), అవిష్క ఫెర్నాండో(3), నువానిందు ఫెర్నాండో(21) వికెట్లను పడొగట్టి లంకను కోలుకోలేని దెబ్బతీశాడు. సదీర సమరవిక్రమ (52), కెప్టె న్ సహన్ అరాచిగే (38) చక్కదిద్దే ప్రయత్నం చేసి నా ఉపయోగం లేకుం డా పోయింది. దీంతో శ్రీలంక 47.1 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌట్ అయింది.






