22 June, 2026 | 2:21 AM

అదరగొడుతున్న ఆనందన అథ్లెట్స్

22-06-2026 01:06 AM

మద్ధ్ధతుగా కోకాకోలా ఫౌండేషన్

ఆక్లాండ్, జూన్ 21: క్రీడానైపుణ్యమనున్న మహిళా అథ్లెట్లను ప్రోత్సహించేందుకు కోకాకోలా ఇండియా ఫౌండేషన్ చేపట్టిన ఆ నందన కార్యక్రమం ద్వారా పలువురు క్రీడాకారిణిలు వెలుగులోకి వస్తున్నారు. తాజాగా భారత మహిళల హాకీ జట్టు ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న ఎఫ్‌ఐహెచ్ ఉమెన్స్ హాకీ నేషన్స్ కప్‌లో సత్తా చాటుతోంది.

ఈ జట్టు లో ఆనందన మద్ధతు అందించిన ఐదుగురు ప్లేయర్స్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టు కున్నారు. డ్రాగ్‌ఫ్లికర్ దీపిక(హర్యానా) గోల్‌కీపర్లు సవిత(హర్యానా), బిచుదేవి (మణి పూర్), డిఫెండర్ లల్తానువాంగి(మణిపూ ర్), ఫార్వార్డ్ అన్ను (హర్యానా) ఈ టోర్నీలో అద్ఙుతంగా రాణించి భారత్ విజయాల్లో కీలకపాత్ర పోషించారు. ఆనందన, కోకాకోలా ఫౌండేషన్ భారత మహిళల హాకీ జట్టుకు ప్రత్యేక శిక్షణా శిబిరాలు నిర్వహిస్తోంది.

ఇటీవల బెంగళూరులో 11 రోజుల పాటు ప్రత్యేక గోల్ కీపింగ్ క్యాంప్ జరిగింది. దీనిని చీఫ్ కోచ్ మారిజ్నే పర్యవేక్షణలో ప్రఖ్యాత గోల్ కీపింగ్ కోచ్ డేవిడ్ విలియమ్సన్ నిర్వహించారు. మహిళా హాకీ జట్టు నైపుణ్యం పెంచేం దుకు ఆనందన, కోకాకోలా అందిస్తున్న మ ద్ధతు వెలకట్టలేదని, వారికి అసోయేషన్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు హాకీ ఇం డియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ చెప్పారు.