22 June, 2026 | 2:22 AM

భారత్ జోరుకు బ్రేక్

22-06-2026 12:59 AM

సౌతాఫ్రికా చేతిలో ఓటమి

మహిళల టీ20 ప్రపంచకప్

మాంచెస్టర్, జూన్ 21: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ కు తొలి ఓటమి ఎదురైంది. చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగి న ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడా తో విజయం సాధించింది. మొదట బ్యాటిం గ్‌కు దిగిన భారత్ ఆరంభం నుంచే ధాటిగా ఆడింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మం ధాన తొలి వికెట్ కు 30 పరుగులు జోడించారు.

స్మృతి (17) ఔటైన కాసేపటికే ధాటి గా ఆడుతున్న షెఫాలీ 31( 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ ) వెనుదిరిగింది. ఇక్కడ నుం చి భారత్ బ్యాటర్లు ధాటిగా ఆడుతూనే వికె ట్లు చేజార్చుకున్నారు. తర్వాత హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.  భారత్ 20 ఓవర్లలో 158 పరుగు లు చేసింది.

తర్వాత లక్ష్యఛేదనలో సఫారీలు నిదానంగానే ఇన్నింగ్స్ ఆరంభించారు. భార త స్పిన్నర్ శ్రీచరణి పవర్ ప్లేలోనే 2 కీలక వికెట్లు పడగొట్టింది. అయితే బ్రిట్స్ , మరిజన్నే కాప్ సౌతాఫ్రికాను ఆదుకున్నారు. వీరి ద్దరూ మూడో వికెట్ కు 97 పరుగులు జో డించారు. బ్రిట్స్ 36 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 40 పరుగులకు ఔటైనప్పటకీ కాప్ భారత్ ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో సౌతాఫ్రికా 19.1 ఓవర్లలో టార్గెట్‌ను అందుకుంది. 

స్కోరు బోర్డు 

భారత్ ఇన్నింగ్స్ : 158/7 ( షెఫాలీ వర్మ 31, దీప్తి శర్మ 29, హర్మన్‌ప్రీత్‌కౌర్ 24 ; కాప్ 2/27, షబ్నమ్ 2/28 )

సౌతాఫ్రికా ఇన్నింగ్స్ : 161/4 ( కాప్ 81 నాటౌట్, బ్రిట్స్ 40, వోల్వార్డ్ 20 ; శ్రీచరణి 3/24, షెఫాలీ వర్మ 1/22)