17 August, 2026 | 10:12 PM

విజ్ఞాన ఆవిష్కరణల్లో వెనకపడ్డాం

24-05-2024 01:19 AM

సీసీఎంబీ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సీఈవో ఎన్‌ఎం రావు

హైదరాబాద్, మే 23(విజయక్రాంతి): విజ్ఞాన ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉందని, కానీ ఆవిష్కరణల విషయంలో వెనుకబడ్డామని సీసీఎంబీ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సీఈవో ఎన్‌ఎం రావు పేర్కొన్నారు. డీప్ టెక్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్‌పై జరిగిన సదస్సులో పాల్గొన్న ఆయన అవసరమైన మేరకు పరిశోధనలు జరగడం లేదన్నారు. హబ్సీగూడలోని అనేక కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థలను డీప్ టెక్ రిసెర్చ్‌లకు ఉపయోగించుకోవాలని సూచించారు. దేశంలో డీప్ టెక్ స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకే నేషనల్ డీప్ టెక్ పాలసీని రూపొందిస్తున్నారని తెలిపారు. ప్రపంచంలో 30శాతం కంటే ఎక్కువ శాఖాహారులు భారత్‌లో ఉన్నారని, అలాగే 40శాతం మంది ఇండియన్లు ఏదో ఒక ప్రొటీన్ లోపంతో ఉన్నారని చెప్పారు.