హోం సీజన్‌లోనూ భారత్ బిజీ
- షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ
- సొంతగడ్డపై రోకో జోడీకి 9 వన్డేలు
ముంబై, మార్చి 26 : భారత క్రికెట్ జట్టు 2026--27 హోం సీజన్ షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లు భారత్‌లో పర్యటించనున్నాయి. మొ త్తంగా 22 మ్యాచ్‌లు జరగనున్నాయి.దీనిలో 9 వన్డేలు, 8 టీ20లు, 5 టెస్టులు ఉన్నాయి. సెప్టెంబర్లో వెస్టిండీస్ పర్యటనతో భారత హోం సీజన్ మొదలవుతుంది. వెస్టిండీస్‌తో భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.
వన్డేలకు త్రివేండ్రం, గౌహతి, న్యూ ఛండీగడ్ ఆతిథ్యమివ్వనుండగా... టీ20లకు లక్నో, రాంచీ, ఇండోర్, హైదరాబాద్‌లను వేదికలుగా నిర్ణయించారు. ఈ హోమ్ సీజ న్లో హైదరాబాద్ వేదికగా రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం ఒక వన్డే, టీ20 మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. హైదరాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో ఒక టీ20, జింబాబ్వేతో ఒక వన్డే మ్యాచ్ జరగనున్నా యి. తర్వాత డిసెంబర్‌లో మూడు వన్డేలు, మూడు టీ20ల కోసం శ్రీలంక భారత్ పర్యటనకు రానుంది.
డిసెంబర్ 13 నుంచి 27 వరకు ఇరు జట్ల మధ్య టీ20, వన్డే సిరీస్ జరగనున్నాయి. అలాగే వచ్చే ఏడాది జనవరిలో మూడు వన్డేల సిరీస్ కోసం జింబాబ్వే.. భారత పర్యటనకు రానుంది. ఇదిలా ఉంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా జనవరి 21 నుంచి ఫిబ్రవరి 27 వరకు భార త్ పర్యటనకు రానుంది. ఇరు జట్లు మొత్తం ఐదు టెస్టులు జరగనున్నాయి. ఇదిలా ఉం టే భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరా ట్ కోహీ హోంసీజన్‌లో 9 వన్డేల్లో కనిపించనున్నారు.
ప్రస్తుతం వన్డేల్లోనే కొనసాగు తున్న రోకో జోడీ 2027 వన్డే ప్రపంచకప్ ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంటా, బయటా కలిపి రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్‌కప్ లోపు 20 వన్డేలు ఆడే అవకాశముంది. కాగా ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్‌లో టీమిండియా ఇంటర్నేషనల్ క్రికెట్‌తో బిజీ అవుతుంది. జూన్ నెలలో భారత్ పర్యటన కు రానున్న అఫ్గానిస్థాన్ ఒక టెస్టు, మూడు వన్డేల సిరీస్ లో తలపడుతుంది. ఈ సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తుంది. అక్కడ ఇంగ్లిష్ జట్టుతో టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది.




