13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

12 వేదికలు.. 50 మ్యాచ్‌లు

27-03-2026 02:11 AM
  1. ఐపీఎల్ రెండో దశ షెడ్యూల్ విడుదల
  2. ఉప్పల్ స్టేడియంలో 7 మ్యాచ్‌లు

ముంబై, మార్చి 26 : ఐపీఎల్ 19వ సీజ న్ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికల జరుగుతుండడంతో ఈ సారి ఐపీఎల్ షెడ్యూల్ విడుదల ఆలస్యమైంది. మార్చి రెండో వారంలో బీసీసీఐ మొదటి దశ షెడ్యూల్‌ను ప్రకటించింది. అ యితే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆయా రాష్ట్రాల పోలింగ్ , కౌంటింగ్ తేదీలు దృష్టిలో ఉంచుకుని రెండో దశ షెడ్యూల్‌పై సుధీర్ఘ కసరత్తు అనంతరం సెకండ్ ఫేజ్ షె డ్యూల్‌ను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.


దీని ప్రకారం రెండో దశలో మొత్తం 50 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఏప్రిల్ 13 నుంచి మే 24 వరకూ దేశవ్యాప్తంగా 12 వేదికలు ఐపీఎల్‌కు ఆతిథ్యమివ్వనున్నాయి. తొలి దశలో 20 మ్యాచ్‌లు, రెండో దశలో 50 మ్యాచ్‌లు కలిపి లీగ్ స్టేజ్‌లో మొత్తం 70 మ్యాచ్‌లు అభిమానులను అలరించనున్నాయి. ప్లే ఆఫ్స్ షెడ్యూల్‌ను తర్వాత ప్రకటి స్తామని బీసీసీఐ వెల్లడించింది. రెండో దశ వేదికలను చూస్తే బెంగళూరు, అహ్మదాబా ద్, హైదరాబాద్, లక్నో, జైపూర్, ముంబై, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, ధర్మశాల, రాయపూర్, న్యూ చండీగఢ్ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి.

సెకండ్ ఫేజ్ షెడ్యూల్‌లో తొలి మ్యాచ్ ఏప్రిల్ 13న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ , రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతుంది. సెకండ్ ఫేజ్ లో 8 డబుల్ హెడర్ మ్యాచ్ లు ఉండగా.. మధ్యాహ్నం మ్యాచ్‌లు 3.30 గంటలకు మొ దలవుతాయి. రాత్రి మ్యాచ్‌లు 7.30 గంటలకు ఆరంభం కానున్నాయి.