పాక్‌ను చిత్తు చేసిన భారత్
కీలక పోరులో అద్భుత విజయం
పురుషుల హాకీ ప్రపంచ కప్
అమస్టెల్వీన్, ఆగస్టు 19: పురుషుల హాకీ ప్రపంచ కప్‌లో భారత్ దుమ్ము రేపుతోంది. ఇంగ్లాండ్ చేతిలో ఓటమి తర్వాత అద్భుతంగా పుంజుకుని చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను చిత్తు చేసింది. హైవోల్టేజ్ పోరులో పాక్‌ను 5-3 గోల్స్ తేడాతో భారత్ ఓడించింది. మ్యాచ్ తొలి నిమిషం నుంచే దూకుడుగా ఆడుతూ మ్య్పా పూర్తి పట్టు సాధించింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మలచడంలో మళ్లీ తన మార్క్ చూపించాడు. 5వ నిమిషంలోనే అతడు తొలి గోల్ సాధించాడు.
11వ నిమిషంలో అభిషేక్ భారత్కు రెండో గోల్ అందించాడు. దీంతో భారత్.. 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. దీంతో తొలి క్వార్టర్లో టీమిండియా 2-0తో ఆధిక్యంలో నిలిచింది. మరోవైపు రెండో క్వార్టర్లోనూ భారత్ ఆధిపత్యం చలాయించింది. హర్మన్ ప్రీత్ (21వ నిమిషం), అభిషేక్ (24వ నిమి షం) మళ్లీ చెరో గోల్ చొప్పున సాధించారు. మూడో క్వార్టర్లో హార్దిక్ సింగ్ (35వ నిమి షం) చేసి.. భారత ఆధిక్యాన్ని భారీగా పెంచేశాడు. ఈ గెలుపుతో భారత్ తదుపరి రౌండ్ కు అర్హత సాధించింది. ఈ విజయం పట్ల హాకీ ప్రియుల్లో సంతోషం వ్యక్తమవుతుంది.






