2047 నాటికి అగ్రగామిగా భారత్
06-04-2026 03:42 AM
- కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్‌లోని ఇంటిపై జెండా ఆవిష్కరణ
కరీంనగర్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): 2047 నాటికి భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా మార్చాలన్నదే తమ లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బండి సంజయ్ ఆదివారం ఉదయం కరీంనగర్‌లోని తన ఇంటిపై పార్టీ జెండాను ఎగురేశారు. అట్టడుగునున్న చిట్ట చివరి పేదవాడికి సైతం అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందజేస్తున్న మహానేత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అని కొనియాడారు.




