13 June, 2026 | 2:14 AM

ఆరంభం అదరాలి

13-06-2026 12:00 AM

నేడు భారత్, ఆఫ్ఘనిస్థాన్ తొలి వన్డే

వరల్డ్‌కప్ సన్నాహాలు షురూ

తుది జట్టు కూర్పుపై ఆసక్తి

ప్రిన్స్ యాదవ్ అరంగేట్రం

సొంతగడ్డపై ఏకైక టెస్టులో ఆప్ఘనిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా ఇప్పుడు వైట్‌బాల్ సిరీస్‌కు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ శనివారం ధర్మశాల వేదికగా జరగబోతోంది. వన్డే ప్రపంచకప్ 2027కు సన్నాహకాలను మొదలుపెట్టిన భారత్ ఇప్పటి నుంచే తుది జట్టు కాంబినేషన్లపై ఫోకస్ పెట్టనుంది. ఈ క్రమంలో పలువురు యువ ఆటగాళ్లను పరీక్షించబోతోంది. 

ధర్మశాల, జూన్ 12: భారత్, ఆప్ఘనిస్థాన్ వన్డే సిరీస్‌కు అంతా సిద్ధమైంది. ముల్లాన్‌పూర్ లో ఏకైక టెస్టును మూడు రోజుల్లోనే ముగించిన టీ మిండియా ఇప్పుడు వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడ మే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. కోహ్లీ, హార్థిక్ పాం డ్యా ఈ సిరీస్‌కు దూరం కావడం అభిమానులకు నిరాశ కలిగించే అంశం. అయితే ఐపీఎల్‌లో రాణించిన పలువురు యువ ఆట గాళ్లకు మాత్రం ఈ సిరీస్ మంచి అవకాశం.

హర్ష దూబే, ప్రిన్స్ యాదవ్ వంటి ప్లేయర్స్ అరంగేట్రం ఖాయమైనట్టే. రోహిత్, గిల్ ఇన్నిం గ్స్ ఆరంభించనుండగా.. కో హ్లీ లేకపోవడంతో వన్ డౌ న్‌లో ఇషాన్ కిషన్‌ను దింపే అవకాశముంది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్ సరిగ్గా మూడేళ్ల క్రితం ఆప్ఘనిస్థాన్ పైనే సిరీస్ ఆడాడు. అటు జైస్వాల్ బెంచ్ కే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహు ల్ వన్డేల్లో అద్భుతమైన బ్యాటర్లు. ఐపీఎల్ ఫామ్ కంటిన్యూ చేసేందుకు ఎదురుచూస్తున్నారు. ఆల్‌రౌండర్ కోటాలో నితీష్ కుమార్ రెడ్డిపై అంచనాలున్నాయి.

ఈ తెలుగు క్రికెటర్ తన సత్తాను నిరూపించుకునేందుకు అద్భుతమైన అవకాశంగా చెప్పొచ్చు. ఎందుకంటే నితీశ్ రెడ్డి బంతితో ఇప్పటి వరకూ పెద్దగా చెప్పుకోదగిన విధంగా రాణించలేదు. అయినప్పటకీ సెలక్టర్లు మాత్రం అతనిపై పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మరిన్ని అవకాశాలు ఇస్తామని గతంలోనే చీఫ్ సెలక్టర్ అగార్కర్ చెప్పిన నేపథ్యంలో ఆప్ఘనిస్థాన్‌తో సిరీస్‌లో తన ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్ ఇస్తాడేమో చూడాలి. ఇదిలా ఉంటే బౌలింగ్ విభా గంలో  హర్ష దూబే లేదా వాషింగ్టన్ సుందర్‌లో ఒకరికి చోటు దక్కనుంది.

స్పెషలిస్ట్ స్పి న్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఉంటాడు. అటు పేస్ ఎటాక్‌లో బుమ్రా లేకపోవడంతో అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణలతో పాటు ప్రిన్స్ యాదవ్‌కు చోటు దక్కొచ్చు. ఇటీవలి ఐపీఎల్ సీజ న్‌లో ప్రిన్స్ యాదవ్ అద్భుతంగా రాణించా డు. పదునైన యార్కర్లతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. మన పేస్ విభాగాన్ని మ రింత బలంగా మార్చే పనిలో ఉన్న గంభీర్ కు ప్రిన్స్ యాదవ్‌కు వరుస అవకాశాలివ్వడం ఖాయం. మరోవైపు ఏకైక టెస్టులో తేలిపోయిన ఆప్ఘనిస్థాన్ వన్డే సిరీస్‌లో మా త్రం గట్టిపోటీనివ్వాలని ఎదురుచూస్తోంది.

హస్మతుల్లా షాహిది  సారథ్యంలోని ఆప్ఘన్ జట్టులోకి మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ వంటి సీనియర్లు రావడం వారి కాన్ఫిడెన్స్ పెంచేదే. అలాగే గుర్బాజ్, ఒమర్జాయ్, జడ్రాన్, రహమతుల్లా వంటి యువ ఆటగాళ్లు కూడా సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్నారు. దీంతో ఆప్ఘన్‌ను మరీ తేలిగ్గా తీసుకున్నా ప్రమాదమే. ఎందుకంటే ఐపీఎల్‌లో ఆడిన ఆప్ఘని స్థాన్ ప్లేయర్స్‌కు భారత్‌లో పిచ్‌లపై మంచి అవగాహన ఉంది.

పిచ్ రిపోర్ట్

మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న ధర్మశాల పిచ్ ఛేజింగ్ జట్లకు అనుకూలంగా ఉంటుంది. 

తుది జట్ల అంచనా

భారత్ : రోహిత్ శర్మ,  గిల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహు ల్ (వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ కృష్ణ, అర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, కుల్దీప్ యాదవ్

ఆప్ఘనిస్థాన్ : గుర్బాజ్, జడ్రాన్, సెదికుల్లా, హస్మతుల్లా షాహిది(కెప్టెన్), రహమత్ షా, ఒమర్జాయ్, నబీ, రషీద్‌ఖాన్, మహ్మద్ సలీమ్, ఘజన్‌ఫర్, రహమాన్