జస్పాల్ రాణా కన్నుమూత
మను బాకర్‌ను తీర్చిదిద్దిన దిగ్గజ కోచ్
ప్రధాని మోదీ సంతాపం
న్యూఢిల్లీ, జూన్ 12: దిగ్గజ షూటర్, ప్రముఖ కోచ్ జస్పాల్ రాణా కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం తీవ్ర అనారోగ్యా నికి గురైన ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. భారత్ స్టార్ షూటర్ మను బాకర్‌ను అత్యుత్తమ షూటర్‌గా తీర్చిదిద్దింది జస్పాల్ రాణానే. ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్‌కప్ కోసం జట్టుతో పాటు జర్మనీ వెళ్లి భారత్‌కు తిరిగివస్తుండగా రాణా అనారోగ్యానికి గురయ్యారు. విమానం దిగిన వెంటనే ఆయనను దిల్లీలోని ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
2006 ఆసియా క్రీడల్లో మూడు స్వర్ణాలు గెలిచిన జస్పాల్ గతంలో జాతీయ జూనియర్ కోచ్‌గా వ్యవహరించారు. అప్పు డే మను బాకర్, సౌరభ్ చౌదరి లాంటి ప్రతిభావంతులైన షూటర్లు వెలుగులోకి వచ్చా రు. పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్యాలు గెలిచిన మను బాకర్‌కు రాణా వ్యక్తిగత కోచ్ గా వ్యవహరించారు. కాగా జస్పాల్ రాణా మృతిపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. “ఆయన మరణం భారత క్రీడా ప్రపంచానికి తీరనిలోటు. షూటింగ్‌లో ఆయన సాధించిన విజయాలతో దేశానికి ఎంతో పేరు తీసుకువచ్చారు. మోదీ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.






