6 July, 2026 | 1:15 PM

Breaking News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •   ప్రియ మిల్క్ పార్లర్ ప్రారంభించిన డిప్యూటీ మేయర్   •  

చేతులెత్తేసిన బ్యాటర్లు.. 46కే భారత్ ఆలౌట్

17-10-2024 01:36 PM

బెంగళూరు వేదికగా జరుగుతున్న భారత్, న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా చేతులెత్తేసింది. 31.1 ఓవర్లలో 46 పరుగులకే టీమ్ ఇండియా ఆలౌట్ అయింది. టెస్టుల్లో తమ మూడో అత్యల్ప స్కోరు చేసిన చెత్త రికార్డును భారత్ నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ (20), జైస్వాల్(13) మినహా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ కే ఔట్ అయిపోయారు. సిరాజ్(04), రోహిత్ శర్మ(02), కుల్ దీప్(02), బుమ్రా(01) ఖాతా తెరిచారు. ఈ మ్యాచులో హెన్నీకి 5 వికెట్లు, విలియమ్ ఓరూర్కెకు 4 వికెట్లు దక్కాయి. భారత్ ఇన్నింగ్స్ లో అత్యధిక భాగస్వామ్యం 21 పరుగులు. ఇన్నింగ్స్ మొత్తం మీద టీమిండియా 4 ఫోర్లు మాత్రమే కొట్టింది. 2020 అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 36 ఆలౌట్ అయింది. 1974 లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ చేతిలో 42కే ఆలౌట్ అయింది.