calender_icon.png 15 July, 2025 | 8:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హర్యానా సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం

17-10-2024 01:55:19 PM

చండీగఢ్: భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు నయాబ్ సింగ్ సైనీ హర్యానా ముఖ్యమంత్రిగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేశారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సీఎంగా నియమితులైన నయాబ్ సింగ్ సైనీతో పాటు ఇతర మంత్రులతో ప్రమాణం చేయించారు. కొత్త నయాబ్ సింగ్ సైనీ కేబినెట్‌లో బీజేపీ ఎమ్మెల్యే అనిల్ విజ్, క్రిషన్ లాల్ పన్వార్, రావ్ నర్బీర్ సింగ్, మహిపాల్ ధండా, విపుల్ గోయెల్ కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎంపీ సీఎం మోహన్ యాదవ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. సాయంత్రం ఎన్డీయే నేతలతో ప్రధాని నరేంద్రమోడీ కీలక సమావేశం నిర్వహించనున్నారు.