11 April, 2026 | 3:49 PM

Breaking News

బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే   •   ఐలాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. కూల్చివేతలపై రంగనాథ్ క్లారిటీ!   •   తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   ఇప్పుడు ఎన్నికలు జరిగినా... కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం   •   కలెక్టర్ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు   •   జ్యోతిరావు పూలే జయంతి ఆశయ సాధన కోసం కృషి చేయాలి   •   20న జగిత్యాలలో కేసీఆర్ సభ... జీవన్ రెడ్డి చేరిక — బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం   •   లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ   •   సారంపల్లిలో శిరీష వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేత   •   మొక్కజొన్న పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలి   •  

టీ ట్వంటీ సిరీస్ భారత్ కైవసం

08-11-2025 04:47 PM

ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్ ను భారత్(Team India) కైవసం చేసుకుంది. వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి ఆధిక్యంలో నిలిచిన టీమిండియా చివరి టీ ట్వంటీలోనూ అదరగొట్టాలని భావించింది. అటు ఆసీస్ కూడా సిరీస్ సమం చేయాలన్న పట్టుదలతో కనిపించింది. అయితే వర్షం కారణంగా చివరి టీ ట్వంటీ రద్దయింది. మ్యాచ్ ఆరంభానికి ముందు వాతవరణం మేఘావృతమై ఉన్నప్పటకీ సమయానికే టాస్ పడింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ తుది జట్టులో ఒక మార్పు జరిగింది.

తిలక్ వర్మకు రెస్ట్ ఇచ్చి రింకూ సింగ్ ను తీసుకున్నారు. భారీ స్కోరు చేయాలన్న లక్ష్యంతో ఓపెనర్లు శుభమన్ గిల్, అభిషేక్ శర్మ ధాటిగా ఆడారు. బౌండరీల మీద బౌండరీలు బాదేశాడు. భారత్ స్కోర్ 52/0 (4.5 ఓవర్లు) దగ్గర ఉండగా మ్యాచ్ నిలిచిపోయింది. ముందు విపరీతమైన గాలి వేయడంతో అంపైర్లు ఆటను ఆపేశారు. తర్వాత భారీ వర్షం కురిసింది. మైదానం చిత్తడిగా మారడంతో చాలాసేపు వేచి చూసిన అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో 2-1తో సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. వన్డే సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. అలాగే ఆసీస్ గడ్డపై టీ20 సిరీస్ ఓటమి ఎరుగని జట్టుగా తన రికార్డును కొనసాగించింది. గత 17 ఏళ్ళు ఆసీస్ లో భారత్ టీ ట్వంటీ సిరీస్ కోల్పోలేదు. ఈ సిరీస్ లో పరుగుల వరద పారించిన అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ దక్కింది.