calender_icon.png 9 November, 2025 | 12:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెస్ ప్రపంచకప్ నుంచి గుకేశ్ ఔట్

08-11-2025 10:42:19 PM

వరల్డ్ చెస్ చాంపియన్ గుకేశ్ దొమ్మరాజుకు ఫిడే ప్రపంచకప్(FIDE World Cup)లో బిగ్ షాక్ తగిలింది. టాప్ సీడ్ గా బరిలోకి దిగిన గుకేశ్ మూడోరౌండ్ లోనే ఇంటిదారి పట్టాడు. జర్మనీకి చెందిన ఫ్రెడె స్వాన్ 55 ఎత్తుల్లో గుకేష్ ను మట్టికరిపించాడు. తొలి గేమ్ డ్రాగా ముగిసినప్పటికీ తర్వాత పట్టుకోల్పోయిన గుకేశ్ రేటింగ్ పాయింట్లలో తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న ప్రత్యర్థి చేతిలో పరాజయం పాలయ్యాడు.

మరోవైపు రెండో సీడ్ అర్జున్ ఎరిగెసి, మూడో సీడ్ ప్రగ్యానంద ముందంజ వేశారు. వీరిద్దరూ నాలుగో రౌండ్లో అడుగుపెట్టారు. అలాగే పెంటేల హరికృష్ణ, వరల్డ్ జూనియర్ చాంపియన్ ప్రణవ్ వెంకటేశ్, ప్రత్యర్థులతో మ్యాచ్ లను డ్రాగా ముగించి నాలుగో రౌండ్ చేరుకున్నారు. యంగ్ ప్లేయర్ ప్రదేశ్ జర్మనీకి చెందిన విన్సెంట్ చేతిలో పరాజయం పాలయ్యాడు. కీగీ విదిత్ గుజరాతి, కార్తీక్ వెంకటరామన్, నారాయణన్ ఎస్ టై బ్రేక్ ఆడనున్నారు. ఈ చెస్ ప్రపంచకప్లో 82 దేశాల నుంచి 206 మంది ప్లేయర్స్ పాల్గొంటున్నారు.