29 June, 2026 | 1:05 AM

‘అతడే మా బలం’

11-06-2024 12:59 AM

న్యూయార్క్: దాయాది పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను జస్‌ప్రీత్ బుమ్రా గెలిపిస్తాడని ముందే తెలుసంటూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో న్యూయార్క్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. ‘మ్యాచ్‌లో పాక్‌కు మేం అనుకున్నంత లక్ష్యాన్ని నిర్దేశించలేకపోయాం. మా బ్యాటింగ్ తొలి అర్థభాగంలో బాగానే సాగింది. ఆ తర్వాత వేగంగా వికెట్లు కోల్పోవడం నష్టం చేసింది. పంత్ ఒక ఎండ్‌లో పోరాడినప్పటికి అతడికి సరైన సహకారం అందలేదు. తొలి 10 ఓవర్లు పాక్ ఆటతీరు చూసిన తర్వాత కూడా విజయంపై నమ్మకం పోలే దు. బుమ్రా నుంచి ఇలాంటి ప్రద ర్శనే ఆశిస్తున్నాం’ అని తెలిపాడు.