13 May, 2026 | 8:15 AM

దోమలను పట్టే యంత్రం

03-05-2024 12:05 AM

కోల్‌కతాకు చెందిన ‘శిశిర్ రాడార్’ అనే స్పేస్ టెక్నాలజీ స్టార్టప్ కంపెనీ దోమల లార్వాను గుర్తించే సాంకేతికతను అభివృద్ధి చేయ డం అభినందనీయం. దోమలతో వచ్చే వ్యాధులు మనుషులకు ప్రాణాంతకమవుతున్నాయి. మురుగు నీరు కూడే చోట పై సాంకేతిక పరికరంతో దోమల లార్వాను గుర్తించే వెసులుబాటు కలగడం వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రభుత్వాలు, ఆయా విశ్వవిద్యాలయాలు ఈ తరహాలో దేశీయ పరిశోధనల అభివృద్ధిని ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

చైతన్య జోషి, ప్రగతినగర్, కూకట్‌పల్లి