13 May, 2026 | 8:55 AM

గంట పొడిగింపు హర్షనీయం

03-05-2024 12:05 AM

రాష్ట్రంలో ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల రోజు (13వ తేదీ) పోలింగ్ సమయాన్ని సాయంకాలం ఒక గంటపాటు పొడిగించడం హర్షనీయం. దీనివల్ల మండే ఎండల బారిన పడకుండా సాయంత్రం 7 గంటల వరకు పౌరులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేసే వెసులుబాటు కలిగింది. మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్లకుగాను 106 నియోజక వర్గాలకు ఈ  ‘అదనపు సమయం’ వర్తిస్తుందని రాష్ట్ర ఎన్నికల ముఖ్య కమిషనర్ ప్రకటించడం బావుంది. పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు ముగియ వలసిన పోలింగ్ 6 గంటల దాకా కొనసాగుతుందన్నమాట. కాగా, మిగిలిన 13 ప్రదేశాలలో తీవ్రవాద ప్రభావం కార ణంగా పోలింగ్ సమయం సాయంత్రం 4 గంటలకే ముగుస్తుంది కనుక, ఈ మేరకు ప్రజలు అప్రమత్తం కావలసి ఉంది.

అరుణ్‌కుమార్, హనుమకొండ