ప్రజల ఆరోగ్యంతో ఆటలు వద్దు
03-05-2024 12:05 AM
మామిడిపండ్లను రసాయనాలతో మగ్గబెట్టే పద్ధతికి వ్యాపారులు ఇకనైనా స్వస్తి చెప్పాలి. వేసవి వచ్చిందంటే చాలు, పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ మామిడి పళ్లు తినాలనిపిస్తుంది. ఏ కాలంలో వచ్చే పండ్లను ఆ కాలంలో తినడం కోసమే చాలామంది ఎదురు చూస్తుంటారు. అయితే, ప్రజల అవసరాన్ని ఆస రాగా చేసుకొని కొందరు మామిడికాయలను కార్బైడ్ వంటి హానికారక రసాయనాలతో మగ్గబెడుతుండటం దురదృష్టకరం. వీరిపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలి.
పార్నంది సాత్విక్‌శర్మ, బోడుప్పల్






