18 July, 2026 | 12:43 AM

హాకీ ప్రపంచకప్‌కు భారత్ మహిళల జట్టు ప్రకటన

18-07-2026 12:43 AM

న్యూఢిల్లీ, జూలై 17: మహిళల హాకీ ప్రపంచ కప్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. వచ్చే నెలలో నెదర్లాండ్స్, బెల్జియం సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న మెగా టోర్నీలో భారత జట్టును హాకీ ఇండియా ప్రకటించింది. సలీ మా టెటే కెప్టెన్‌గా ఎంపికైంది. మొత్తం 20 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రధాన కోచ్ స్జోర్డ్ మారైన్ ఎంపిక చేశారు. ఆగస్టు 15 నుంచి 30 వరకు జరిగే ప్రపంచకప్‌కు ముందు బెంగళూరులో ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించనున్నారు.

ఇటీవల న్యూజిలాండ్ లో జరిగిన ఎఫ్‌ఐహెచ్ నేషన్స్ కప్‌లో ఓటమి లేకుండా టైటిల్ గెలిచిన ఆటగాళ్లకు ప్రాధాన్యత దక్కింది. గోల్‌కీపర్లుగా సవిత, బిచు దేవి ఖరిబామ్, డిఫెండర్లుగా ఇషికా చౌదరి, సుశీలా చాను, లాల్తంత్లువాంగి, జ్యోతి, శిల్పి దబాస్, మిడ్‌ఫీల్డర్లు గా సలీమా టెటే (కెప్టెన్), నిక్కీ ప్రధాన్, సాక్షి రాణా, సునెలితా టొప్పో, నేహా, దీపికా సో రెంగ్, ఫార్వరడ్స్‌గా లాల్రెమ్సియామి, రుతు జాదాదాసో పిసాల్, నవ్నీత్ కౌర్, దీపిక, ఇషికా, బల్జీత్ కౌర్, బ్యూటీ దుంగ్దుంగ్ ఎంపికయ్యా రు. ఆగస్టు 16న చైనా, 18న దక్షిణాఫ్రికా, 20న ఇంగ్లండ్ల్‌తో భారత్ తలపడనుంది.