14 July, 2026 | 7:21 AM

ఇటలీలో భారత కార్మికుడి మృతి

27-06-2024 12:10 AM

సంతాపం తెలిపిన ప్రధాని మెలోనీ

న్యూఢిల్లీ, జూన్ 26: ఇటలీలో యజమానికి దాక్షిణ్యానికి గురై ప్రాణాలు కోల్పోయిన భారత్‌కు చెందిన వ్యవసాయ కార్మికుడు సత్నాంసింగ్‌కు ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీ సంతాపం ప్రకటించారు. సరైన ఉద్యోగ పత్రాలు లేకుండా ఇటలీలోని ఓ రైతు వద్ద పనిచేస్తున్న సత్నాంసింగ్ ఇటీవల తీవ్రంగా గాయపడ్డాడు. యంత్రంలో పని అతడి చెయ్యి తెగిపోయింది. దీంతో అతడి యజమాని తెగిన చెయ్యితోపాటు సత్నాంసింగ్‌ను రోడ్డుపక్కన పడేసి వెళ్లిపోయారు. సత్నాం భార్య పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఎయిర్ అంబులెన్స్‌లో అతడిని దవాఖానకు తరలించినా ప్రాణాలు దక్కలేదు.

ఈ అమానుష ఘటనపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్నది. కార్మికుల రక్షణ కోసం కఠిన చట్టాలు తేవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని బుధవారం పార్లమెంటులో సత్నాం సింగ్ మృతికి సంతాపం తెలుపుతూ ప్రకటన చేశారు. పార్లమెంటు కూడా అతడి మృతికి సంతాపం తెలిపింది. సభ్యులు లేచి నిలబడి నివాళి అర్పించారు. సత్నాంసింగ్ మృతికి కారణమైనవాళ్లను కఠినంగా శిక్షిస్తామని ప్రధాని ప్రకటించారు. ఇలాంటి అమానవీయ పనులు ఇటలీ పౌరులు చేయరని అన్నారు.