2 May, 2026 | 9:23 PM

Breaking News

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం   •   విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి   •   మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం   •   సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •  

ఒలింపిక్స్‌లో సెమీస్‌ చేరిన భారత్‌ రెజ్లర్

08-08-2024 04:35 PM

మాజీ ప్రపంచ ఛాంపియన్ ను మట్టికరిపించిన భారత రెజ్లర్ అమన్

పారిస్ ఒలింపిక్స్: భారత్ రెజ్లర్ అమన్ సహ్రావత్ సెమీస్ కు చేరారు. క్వార్టర్ ఫైనల్లో జెలిమ్ ఖాన్ అబకరోవ్ పై అమన్ సహ్రావత్ విజయం సాధించారు. పురుషుల 57 కిలోల విభాగంలో అల్బేనియా రెజ్లర్ ఖాన్ పై 12-0 తేడాతో అమన్ అద్భుత విజయం సాధించారు. మాజీ ప్రపంచ ఛాంపియన్ పై భారత రెజ్లర్ అమన్ సహ్రావత్ గెలుపొందడంతో ఇండియన్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటు పారిస్ ఒలింపిక్స్ లో భారత రెజ్లర్‌ అంతిమ్‌ పంఘాల్‌పై ఐవోఏ మూడేళ్ల నిషేధం విధించింది. ఒలింపిక్స్‌లో క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడినందుకు పంఘాల్‌పై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.