పారిస్ ఒలింపిక్స్: భారత రెజ్లర్ అంతిమ్ పంఘాల్ చిక్కుల్లో పడ్డారు. పారిస్ ఒలింపిక్స్‌లో క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినందుకు భారత అంతిమ్ పంఘాల్‌పై భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) మూడేళ్లపాటు నిషేధం విధించింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు అంతిమ్ పంఘాల్ పై చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. అటు పారిస్ ఒలింపిక్స్ లో రెజ్లింగ్ లో అన్షు మాలిక్ పరాజయం పాలయ్యారు. మహిళల 57 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో ప్రిక్వార్టర్స్ లో హెలెన్ (అమెరికా)చేతిలో 2-7 తేడాతో అన్షు మాలిక్ ఓడిపోయారు.