07-08-2024 12:55:51 PM
పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ లో భారత్ ఆశలు గల్లంతయ్యాయి. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో పోటీపడుతున్న వినేశ్ ఫోగట్‌పై అనర్హత వేటు పడింది. తన ఈవెంట్‌కు పరిమితికి మించి అధిక బరువు కారణంగా చర్యలు తీసుకున్నట్లు ఐవోఏ పేర్కొంది. వినేశ్ నిర్దేశిత బరువు కన్నా 100 గ్రాములు ఎక్కువ ఉన్నారు. 50 కిలోల కన్నా 100 గ్రాములు ఎక్కువ ఉండటంతో చర్యలు తీసుకున్నారు. వినేశ్ ఫొగట్ అనర్హత కారణంగా పతకం పొందే అవకాశం కోల్పోయారు. రెజ్లింగ్ మహిళల 50 కిలోల విభాగంలో వినేష్ ఫొగాట్ ఫైనల్ చేశారు.