07-08-2024 01:33:13 PM
వినేశ్.. మీర ఛాంపియన్లలో ఛాంపియన్
రెజ్లింగ్ మహిళల 50 కిలోల విభాగంలో ఫైనల్ చేరిన వినేశ్ ఫొగట్ పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటు అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. వినేశ్.. మీరు ఛాంపియన్లలో ఛాంపియన్ అని ప్రధాని కొనియాడారు. వినేశ్ దేశానికి గర్వకారణం.. ప్రతీ భారతీయుడికి స్ఫూర్తి అన్నారు. ఇవాళ జరిగిన ఘటన బాధించవచ్చు.. సవాళ్లకు ఎదురొడ్డి నిలబడటం వినేశ్ స్వభావం అని పేర్కొన్నారు. వినేశ్ అర్హతపై ప్రధాని మోడీ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అధ్యక్షురాలు పి.టి ఉషతో కూడా మాట్లాడారు. వినేశ్ కేసుకు సంబంధించి ఉన్న అవకాశాలన్నీ పరిశీలించాలని సూచించారు. ఆమె అనర్హతకు సంబంధించి ప్రధాని బలంగా నిరసన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా వినేశ్ ఫోగట్ మంగళవారం చరిత్ర సృష్టించింది. అయినప్పటికీ, బుధవారం ఉదయం బరువు-ఇన్‌లో ఆమె 50 కిలోల బరువు విభాగంలో కొన్ని కిలోగ్రాముల బరువు పెరగడంతో ఆమె పారిస్ ఒలింపిక్స్‌కు అనర్హులైంది.