calender_icon.png 13 July, 2025 | 1:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుమల ఘాట్‌రోడ్డులో ప్రమాదం: బస్సు కింద ఇరుక్కుపోయిన మృతదేహాలు

07-08-2024 12:02:44 PM

తిరుమల రెండవ ఘాట్‌రోడ్డులో బుధవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. చివరిమలుపు వద్ద  ఆర్టీసీ బస్సు  బైక్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతదేహాలు బస్సు కింద ఇరుక్కుపోయాయి. క్రేన్‌ సాయంతో మృతదేహాలను తీసేందుకు అధికారుల ప్రయత్నం చేస్తున్నారు. మృతులు తమిళనాడుకు చెందిన దంపతులుగా పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.