రాజీవ్ గాంధీ కృషి వల్లే భారత్ సాంకేతిక అభివృద్ధి
మహబూబాబాద్, మే 21 (విజయక్రాంతి): భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ముందు చూపుతోనే భారతదేశ సాంకేతిక రంగంలో గణనీయ అభివృద్ధి సాధించిందని మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు డాక్టర్ భూక్యా ఉమ అన్నారు. స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
దేశ సమగ్రత, శాంతి, ప్రజాస్వా మ్య విలువల పరిరక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసిన నాయకుడని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుగులోత్ జ్యోతి రమేష్ నాయక్, పట్టణ కాంగ్రెస్ పార్టీ పలు వార్డుల ప్రస్తుత కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, మహిళా నాయకురాలు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, పట్టణ మైనార్టీ సెల్, ఎస్టీ సెల్, ఎస్సీ సెల్,ఓబీసీ సెల్,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
సాంకేతిక విప్లవ సృష్టికర్త రాజీవ్ గాంధీ
వరంగల్, మే 21 (విజయక్రాంతి): మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ ముందు చూపుతో భారతదేశాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేశాడని, ఆయన చేసిన కృషి వల్లే ఇప్పుడు భారతదేశ ప్రపంచంలో గుర్తింపు పొందిందని వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యుబ్, టీ. పి. సీ. సీ. డెలిగేట్ మెంబర్ సీనియర్ నాయకులు నల్గొండ రమేష్ అన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సోమ లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర సెక్రటరీ గిరిగిరి పుష్ప , సీనియర్ నాయకులు కరాటే ప్రభాకర్, వరంగల్ తూర్పు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
దేశాభివృద్ధికి రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం
మరిపెడ (మహబూబాబాద్) మే 21 (విజయక్రాంతి): దేశ అభివృద్ధికి రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయమని మరిపెడ మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వంటికొమ్ము యుగంధర్ రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మరిపెడ పట్టణంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు,
కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాజీవ్ గాంధీ సేవలను స్మరించుకున్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ, దేశాన్ని ఆధునిక సాంకేతిక రంగంలో ముందుకు తీసుకెళ్లడంలో రాజీవ్ గాంధీ కీలక పాత్ర పో షించారని, యువతకు అవకాశాలు కల్పిస్తూ భారతదేశాన్ని సమాచార సాంకేతిక రంగం లో కొత్త దిశగా నడిపించిన దూరదృష్టి గల నాయకుడని కొనియాడారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం, యువత సాధికారత కోసం చేసిన కృషి దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ అప్సర్, మరిపెడ మాజీ సర్పంచ్ పానుగోతు రాం లాల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండగాని వెంకన్న, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు షేక్ అఫ్జల్, జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు విజయ్ నాయక్ , మరిపెడ మున్సిపల్ కౌన్సిలర్లు రమేష్ నాయక్, తిరుపతి నాయక్, జాటోతు సురేష్ నాయక్, నీలా లచ్చిరాం నాయక్, కరణ్ సింగ్, బోడ రవి, బానోతు చిన్న, రాములు, మెరుగు రాము, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు రవికాంత్, యువజన నాయకులు ప్రమోద్, వెంకట్ సాయి, సర్వర్ భాయ్, సాజిద్, రమేష్, బోడ శ్రీను, లక్ష్మణ్, పరశురాములు తదితరులు పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు.
రాజీవ్ గాంధీ కృషితోనే యువతకు రాజకీయ అవకాశాలు : ఎంపీ కడియం కావ్య
హనుమకొండ అర్బన్, మే 21 (విజయక్రాంతి): స్వర్గీయ రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల యువతకు రాజకీయాలతో పాటు అనేక కీలక రంగాల్లో అవకాశాలు లభించాయని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. భారతరత్న, దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాల యంలో ఆయన చిత్రపటానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కా వ్య పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎంజీఎం సర్కిల్లో రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
గీసుగొండ మండలంలోనికోనాయిమాకుల వద్ద రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి ని వాళులు అర్పించారు. గీసుగొండ మం డలం, కె.యం.టి.పీ రెసిడెన్షియల్ లేఅవుట్ గ్రామంలో 58 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పార్క్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, దొంతి మాధవ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి గార్లు పాల్గొన్నారు.






