2 June, 2026 | 2:57 AM

ఇండికా వారి సరికొత్త వ్యూహం

02-06-2026 01:58 AM
  1. రెండు పండుగలుగా ‘ఇండిక్ ఫిల్మ్ ఉత్సవ్’
  2. నేటి నుంచే ఎంట్రీల ఆహ్వానం

హైదరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ప్రముఖ సాంస్కృతిక సంస్థ ఇండికాకు చెందిన ’సెంటర్ ఫర్ ఇండిక్ ఫిల్మ్స్ (సీఐఎఫ్) తన 7వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భం గా ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. తన ఫ్లాగ్షిప్ చిత్రోత్సవ పరిధిని మరింత విస్తృ తం చేస్తూ.. ఈ ఏడాది నుండి రెండు ప్రత్యేక పండుగలుగాదీనిని నిర్వహించబోతున్నట్లు వెల్లడించింది.

ఇందులో భాగంగా ‘ఇండికా డల్లాస్ ఫిల్మ్ ఉత్సవ్’, ‘ఇండికా హెరిటేజ్ ఫిల్మ్ ఉత్సవ్’ ల కోసం ఫీచర్ ఫిలమ్స్, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిలమ్స్ ఎంట్రీలను ఆహ్వా నిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా ఇండికా వ్యవస్థాపకులు హరి వడ్లమాని మాట్లాడుతూ, ‘నాగరికతకు సం బంధించిన విజ్ఞానాన్ని భవిష్యత్తు తరాలకు అందించడంలో సినిమా అత్యంత శక్తివంతమైన సాధనం.

సమాజానికి స్ఫూర్తినిచ్చే, మ న సంస్కృతి యొక్క లోతైన విలువలను ప్రతిబింబించే ’పాజిటివ్ సినిమా’ శక్తినే ఇం డికా బలంగా నమ్ముతుంది. ఈ సరికొత్త ద్వంద్వ విధానం ద్వారా మేము అటు గ్లోబల్ డిజిటల్ ప్లాట్ఫారమ్ను, ఇటు ప్రత్యక్షంగా కలుసుకునే ఒక అద్భుతమైన వేదికను నిర్మిస్తున్నాం‘ అని తెలిపారు. సెంటర్ ఫర్ ఇండిక్ ఫిలమ్స్ చీఫ్ క్యూరేటర్ అండ్ కో-ఫౌండర్ దంజి తోటపల్లి మాట్లాడుతూ.. ‘ఈ రెండు పండుగలను వేర్వేరు ప్రేక్షకుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందిం చాం.

డల్లాస్ ఈవెంట్ స్థానిక ప్రేక్షకులకు థియేటర్ అనుభవాన్ని, వర్క్‌షాప్‌లను, కం టెస్టులను అందిస్తుంది. అదే సమయంలో ఆన్లైన్ ఈవెంట్ భౌగోళిక సరిహద్దులతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులను కలుపుతుంది‘ అని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం వ్బుసైట్ https://cif.indica.inను సందర్శించవచ్చు.

ఇండికా డల్లాస్ ఫిల్మ్ ఉత్సవ్ (ఇన్-పర్సన్ థియేట్రికల్)

ఇది అమెరికాలోని టెక్సాస్, డల్లాస్ నగరంలో ఏటా మూడు రోజుల పాటు థియేటర్లలో ప్రత్యక్షంగా జరిగే వేడుక. రాబోయే ఎడిషన్ 2026 నవంబర్ 13 నుండి 15 వరకు డల్లాస్లోని ’గెలాక్సీ థియేటర్స్’ లో జరగనుంది. ఇక్కడ సినీ నిర్మాతలు, ప్రేక్షకులు మరియు మేధావులు ఒకచోట చేరి సరికొత్త సినిమా అనుభూతిని పంచుకుంటారు.

ఇండికా హెరిటేజ్ ఫిల్మ్ ఉత్సవ్ (గ్లోబల్ ఆన్లైన్)

ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆన్లైన్ చిత్రోత్సవం. సంస్కృతి, నాగరికత, మరియు చారిత్రక వారసత్వ నేపథ్యాల చిత్రాల కోసం దీనిని కేటాయించారు. 24 గంటల పాటు ఎప్పుడైనా, ఎక్కడైనా వీక్షించేలా రూపొందించిన ఈ ఆన్లైన్ ఫెస్టివల్ 2027 మార్చి 11 నుండి 14 వరకు జరగనుంది.