9 April, 2026 | 8:36 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

నష్టాల్లో ముగిసిన సూచీలు

13-12-2024 12:00 AM

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీ లు గురువారం  నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నా.. మన మార్కెట్లు మాత్రం ఒడుదొడుకులకు లోనై తర్వాత నష్టాల్లో స్థిరపడ్డాయి. ఐటీ స్టాక్స్ రాణించినప్పటికీ.. మిగిలిన రంగాల షేర్లలో మాత్రం స్తబ్ధత నెలకొంది. నవంబర్ నెల కు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు  వెలువడనున్న వేళ మదుపర్లు అప్రమత్తత పాటించడం గమనార్హం.

సెన్సెక్స్   ఉదయం 81,476.76 పాయిం ట్ల వద్ద (క్రితం ముగింపు 81,526.14) నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ.. కాసేపు లాభాల్లో కదలాడింది. తర్వాత నష్టాల్లోకి జారుకున్న సూచీ.. ఏ దశలోనూ కోలుకోలేదు. ఇంట్రాడేలో 81,211.64 వద్ద కనిష్ఠా న్ని తాకిన సూచీ. చివరికి 236.18 పాయిం ట్ల నష్టంతో 81,289.96 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 93.10 పాయింట్ల నష్టంతో 24,548. 70 వద్ద ముగిసింది. డాలరుతో రూపా యి మారకం విలువ 84.87గా ఉంది.

సెన్సెక్స్ 30 సూచీలో ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, ఎల్‌అండ్‌టీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్‌షేర్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 73.68 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 2747 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.