విమానాలపై సాఫ్ట్‌వేర్ ప్రభావం
న్యూఢిల్లీ: ఎయిర్‌బస్(Airbus) తన గ్లోబల్ ఏ320 ఫ్యామిలీ ఫ్లీట్ కోసం జారీ చేసిన సాంకేతిక ఆదేశాల నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా(Air India), ఇండిగో శనివారం ఆలస్యం, షెడ్యూల్ సర్దుబాట్లను ప్రకటించడంతో అనేక మార్గాల్లో విమాన ప్రయాణాలకు అంతరాయం(Air travel disruption) కలిగింది. ఎయిర్ ఇండియా "ప్రస్తుతం అన్ని ఎయిర్‌లైన్ ఆపరేటర్లలో సర్వీసులో ఉన్న A320 ఫ్యామిలీ ఎయిర్‌క్రాఫ్ట్‌లకు సంబంధించి ఎయిర్‌బస్ నుండి వచ్చిన ఆదేశం గురించి మాకు తెలుసు. దీని ఫలితంగా మా ఫ్లీట్‌లోని ఒక భాగంలో సాఫ్ట్‌వేర్/హార్డ్‌వేర్(Software Upgrade) రీఅలైన్‌మెంట్ జరుగుతుంది. దీని వలన మా షెడ్యూల్ చేసిన కార్యకలాపాలకు ఎక్కువ సమయం, జాప్యం జరుగుతుంది" అని ఎక్స్ పోస్ట్‌లో తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా సుమారు ఆరు వేల విమానాలపై కొత్త సాఫ్ట్ వేర్(New software) ప్రభావం పడింది. ప్రస్తుతం ఇండిగో, ఎయిరిండియా ఏ 320, 350 విమానాలను నడుపుతున్నాయి. ఏ 320, 350 మోడల్ విమానాలను డీజీసీఏ(Directorate General of Civil Aviation) గ్రౌండింగ్ చేసింది. సాఫ్ట్ వేర్ అప్ డేట్ మార్పుల వల్ల గ్రౌండింగ్ చేయాలని డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. సోమ, మంగళవారాల్లో విమాన సర్వీసులు పునరుద్ధరించే అవకాశముందని అధికారులు తెలిపారు. ప్రయాణీకులకు రీబుకింగ్, లేటెస్ట్ అప్డేట్, సమాచారంతో మద్దతు ఇవ్వడానికి ఇండిగో బృందాలు 24x7 అందుబాటులో ఉన్నాయని, విమానాశ్రయానికి వెళ్లే ముందు ప్రయాణికులు తమ విమాన స్థితిని తనిఖీ చేయాలని కోరారు. ఎయిర్‌బస్ ఆదేశించిన ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటున్నందున, రెండు విమానయాన సంస్థలు తమ వినియోగదారులకు నిరంతర సహాయం అందిస్తామని హామీ ఇచ్చాయి.




