09-12-2025 06:47:38 PM
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా భారీగా విమానాలు రద్దయిన నేపథ్యంలో ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ బహిరంగ క్షమాపణ చెబుతూ మంగళవారం ఒక వీడియోను విడుదల చేశారు. గత కొన్ని రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ కోలుకోవడం ప్రారంభించిందని, దీంతో ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి ఎయిర్‌లైన్ తరుపున క్షమాపణలు చెబుతున్నానని, ఇకపై ఇండిగో కార్యకలాపాలు సాధారణంగా కొనసాగుతాయని ఇండిగో సీఈఓ హామీ ఇచ్చారు.
మీ విమానయాన సంస్థ ఇండిగో తిరిగి కార్యకలాపాలు సాదారణ స్థితికి వచ్చాయని, కార్యకలాపాల్లో తమకు అంతరాయం కలిగినప్పుడు మిమ్మల్ని నిరాశపరిచినందుకు తాము తీవ్రంగా చింతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇండిగో విమానాల రద్దును వెనక్కి తీసుకోలేనప్పటికీ, ఇండిగో బృందం అప్పటి నుండి చాలా కష్టపడి పనిచేస్తోందని పీటర్ ఆల్బర్స్ తన ప్రకటనలో రాశారు.
విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన ప్రయాణీకులను జాగ్రత్తగా చూసుకున్నామని, రద్దు చేసిన అన్ని టిక్కెట్లను ప్రశ్నించకుండా తిరిగి చెల్లించామని, ఎవరి లగేజీని వారికి తిరిగి ఇచ్చిందన్నారు. నిన్నటి నుంచి ప్రయణికులను వందకుపైగా గమ్యస్థానాలకు తామ సర్వీసులు ప్రారంభిస్తూ ప్రభుత్వానికి తమ వంతుగా సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఈ ఆకస్మిక సంక్షోభాన్ని ఇప్పుడు పరిష్కరించిన తర్వాత, అది ఎందుకు జరిగిందో, దాని నుండి ఎలా బయటపడాలనే దానిపై ఎయిర్‌లైన్ అంతర్గతంగా పరిశీలించడం ప్రారంభించిందని పీటర్ ఎల్బర్స్ వివరించారు.