10-12-2025 01:13:32 AM
యూటీలు, రాష్ట్రప్రభుత్వాలకు సుప్రీం కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ, డిసెంబర్ 9: రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ కొనసాగాల్సిందేనని సుప్రీం కోర్టు న్యాయస్థానం రాష్ట్రప్రభుత్వాలు, యూటీలకు తేల్చిచెప్పిం ది. ‘సర్’ ప్రక్రియను సవాల్ చేస్తూ బెంగాల్‌తోపాటు పలు రాష్ట్రాలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఈ పిటిషన్లపై మంగళవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది.
‘సర్’ నిర్వహించే బీఎల్వోలు, యంత్రాంగానికి బెదిరించడం సరికాదని పేర్కొంది. ఇకపై అలాంటి బెదిరింపులు తమ దృష్టికి వస్తే వారి భద్రత కోసం ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తామని హెచ్చరించింది. అలాగే బీఎల్వోలు ఒత్తిడికి గురైతే, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.